Tuesday 25 May 2010

నవ శకం సౌధాలు

అవినీతి పెను తుఫాను

దేశాన్ని అతలాకుతలం చేస్తోంది

మానవత్వపు మహావృక్షాన్ని

కూకటి వ్రేళ్ళతో పెల్లగించేస్తోంది

లంచగొండి తనపు వరదల్లో

ధర్మ సౌధాలు పునాదుల్తోసహా కొట్టుకుపోతున్నాయి

అరాచకపు కారుమేఘాలు

న్యాయం అనే సూరీన్ని సునామిలా కమ్మేశాయి

మతోన్మాదపు వెల్లువ

ఇంకా కళ్ళు తెరవని రేపటి తరం

పసి కూనల్ని సైతం

ముంచేస్తుంటే - మనకేం పట్టనట్టు

ఊరుకుంటే ఇక లాభం లేదు

ఉపాధ్యాయులారా! ఉద్యమ నేతలారా!

శాస్త్రజ్గ్నులారా! ఓ పరిశోధనా ప్రకాన్డులారా!

క్లోనింగు ద్వారా మనుషుల్ని తయారు చేస్తే ఏమి లాభం

బోధనల ద్వారా పరిశోధనల ద్వారా

మానవత్వాన్ని తయారు చేయండి

లంచగొండి తనాన్ని తుదముట్టించే

బాంబు ఏదైనా కనిపెట్టండి

జాలి, కరుణ ,గులికల్ని తయారు చెయ్యండి

అప్పుడే నవ భారత పునాదుల పై

నవ శకం సౌధాలు లేస్తాయి.

-జి. మురళి. 01.02.2010.